◀ ▶
ఎవరైతే ఈ శ్లోకాలను నిత్యం భక్తితో స్మరిస్తారో వారు శ్రీ దత్తాత్రేయుని కృపకు అర్హులై ఆయనచే సమస్త సన్మంగలములను మరియు సంఘంలో గౌరవంను పొందుతారు.
శ్రీదత్త స్తోత్రం
(ఘోర కష్టోద్ధారణ స్తోత్రం)
శ్రీపాద శ్రీవల్లభ త్వం సదైవ
శ్రీ దత్తాస్మాన్ పాహి దేవాధిదేవ
భావగ్రాహ్య క్లేశహారిన్ సుకీర్తే
ఘోరాత్ కష్టాత్ ఉద్ధారాస్మాన్ నమస్తే ||ఘో ||
భావం : దేవధిదేవా, శ్రీదత్తాత్రేయా, భక్త పరాధీనుడవని పేరుగాంచిన నీవు, మమ్ములను రక్షించమని, ఘోరమైన కష్టములనుండి, బాధాకరమైన వ్యాధులనుండి, కష్టముల నుండి తప్పించవలసినదిగా ప్రార్ధిస్తూ శిరస్సువంచి నమస్కరిస్తున్నాను.
త్వం నో మాతా త్వం పితా ప్తోధిపస్త్వం
త్రాతా యోగక్షేమ కృత్ సద్గురు స్త్వం
త్వం సర్వస్వం నో ప్రభో విశ్వమూర్తే
ఘోరాత్ కష్టాత్ ఉద్ధారాస్మాన్ నమస్తే ||ఘో||
భావం : ప్రభో దత్తాత్రేయా, బ్రహ్మ విష్ణు స్వరూపుడైన నీకన్నా మాకు అధికులెవ్వరూ లేరు. నీవే మా తల్లివి, తండ్రివి, యజమానివి, బంధువు మరియు సద్గురుడవు. నీవు అనుక్షణం మా యోగ క్షేమములను విచారించుచుందువు. మాకు సర్వస్వమైన మా ఘోరమైన కష్టములనుండి, బాధాకరమైన వ్యాధులనుండి తపించవలసినదిగా ప్రార్ధిస్తూ శిరస్సువంచి నమస్కరిస్తున్నాను.
భీతిం క్లేశం త్వం హరాశు త్వదన్యం
త్రాతారం నీ వీక్ష్య ఈశాస్తజూర్తే
ఘోరాత్ కష్టాత్ ఉద్ధారాస్మాన్ నమస్తే ||ఘో||
భావం : హే ఈశ్వరా, మా సమస్త పాపతాపముల నుండి శారీరక, మానసిక వ్యాధులనుండి దారిద్యము, భయము, భాదల నుండి మమ్ములను రక్షించుటకు నీకన్నా మరెవ్వరూ లేరు. మాకు సర్వస్వమైన నిన్ను ఘోరమైన కష్టములనుండి, బాధాకరమైన వ్యాధుల నుండి, కష్టముల నుండి తప్పించవలసినదిగా ప్రార్ధిస్తూ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
త్వత్తో దేవ త్వం శరణ్యోకహర్తా
కుర్యాత్రేయానుగ్రహం పూర్ణరాతే
ఘోరాత్ కష్టాత్ ఉద్ధారాస్మాన్ నమస్తే||ఘో||
భావం : నీకన్నా మమ్ములను రక్షించువారు, మాకు వరములను ప్రసాదించువారు, మమ్ములను భరించువారు మరింకెవ్వరున్నారు. నిన్ను శరణుజొచ్చిన వారి సమస్త బాధలను నీవు తొలగించెదవు. ఓ అత్రిమహర్షి పుత్రుడా! మాకు సర్వస్వమైన నిన్ను ఘోరమైన కష్టముల నుండి, బాధాకరమైన వ్యాధులనుండి, కష్టముల నుండి తప్పించవలసినదిగా ప్రార్ధిస్తూ శిరస్సువంచి నమస్కరిస్తున్నాను.
ధర్మే ప్రీతిం సన్మతిం దేవభక్తిం
సత్సంగాప్తిందేహి భుక్తిం చ ముక్తిమ్
భావాసక్తిం చాఖిలానంద మూర్తీ
ఘోరాత్ కష్టాత్ ఉద్ధారాస్మాన్ నమస్తే||ఘో||
భావం : ఓ అఖిలాండేశ్వరా, మాలో ధర్మము యెడల ప్రేమ, భక్తి, బుద్ధి, సత్సంగము, ముక్తి... లను ప్రసాదించుము. మా కోరికలను నెరవేర్చి మాకు సర్వస్వమైన నిన్ను ఘోరమైన కష్టముల నుండి, బాధాకరమైన వ్యాధులనుండి, కష్టముల నుండి తప్పించవలసినదిగా ప్రార్థిస్తూ శిరస్సువంచి నమస్కరిస్తున్నాను.
ప్రపఠేన్నియతో భక్త్యా స శ్రీదత్తప్రియో భవేత్