Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

జ్యోతిర్లింగాలు (జ్యోతి యొక్క మహిమ)

జ్యోతిర్లింగాలు జ్యోతి యొక్క మహిమ

     హిమాలయాల్లో కాంగడా ఘాట్లలలో 'జ్వాలాముఖి' అనే దివ్యక్షేత్రం ఒకటుంది. పృథ్విగర్భం నుంచి నిరంతరం ప్రకాశవంతంగా ఉండే ఒక మహా జ్యోతి అక్కడ కనిపిస్తుంది. సాక్షాత్తు పరమేశ్వరుడు ౼ శుభంకరుడు ౼ శంకరుడు ఆ తేజోమయ రూపంలో ప్రకటితమవుతాడు. ఆ పవిత్ర జ్యోతిని దర్శించడానికి భక్తజనులు తండోపతండాలుగా వస్తూనే ఉంటారు. జ్యోతి యొక్క ఈ అద్భుతం అనేక స్థానాలలో కనిపిస్తుంది. ఆ స్థానంవద్ద దర్శనార్థం మేళాలు జరుగుతాయి. ఆ స్థానాలు ఇవే ౼

" సౌరాష్ట్రే సోమనాథం చ, శ్రీశైలే మల్లికార్జునమ్ ||

ఉజ్జయిన్యాం మహాకాళం ఓంకారేత్వమల్లేశ్వరమ్ ||

పరళ్యాం వైద్యనాథంచ డాకిన్యాం భీమశంకరం ||

సేతుబంధేతురామేశ్వరం నాగేశం దారుకావనే ||

వారణాస్యాంతు విశ్వేశం త్యంబకం గౌతమీతటే ||

హిమాలయేతు కేదారం ఘృష్ణేంచ విశాలకే || "

        ప్రాచీనకాలంలో ఈ స్థానాలన్ని "జ్వాలాముఖి" వలె ఉండవచ్చు కానీ ప్రస్తుతం ఇక్కడ భవ్యమైన "శివ మందిరాలు" నిర్మించబడ్డాయి. మహాదేవుడు అంటే ద్వాదశజ్యోతిర్లింగాలు యొక్క తేజోమయ పవిత్ర స్థానాల మహిమ అని అర్థం. అన్ని జ్యోతిర్లింగాల దర్శనానికి భక్తజనులు గుంపులుగుంపులుగా తరలివస్తారు.

         సాగరతీరంలో 2, నదీ తీరాలలో 3, పర్వత శిఖరాల పై 4, మరియు మైదాన ప్రదేశాలలో గల గ్రామాల వద్ద మూడు చొప్పున ఈ 12 జ్యోతిర్లింగాలు వివిధ రూపాలలో కనిపిస్తాయి. ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్క రకంగా వర్ణించారు.

            భూమిపై అనేకచోట్ల ముఖ్య లింగాలు ఉన్నప్పటికీ వీటిలో ప్రముఖమైనవి ద్వాదశ జ్యోతిర్లింగాలు అవి:- ( సౌరాష్ట్రంలో- సోమనాథ్, , శ్రీశైలంలో మల్లికార్జునుడు, ఉజ్జయినిలో మహాకాళుడు, వింధ్యప్రదేశంలో ఓంకారేశ్వరుడు, హిమాలయశృంగాలపై కేదారం డాకినీలో భీమశంకరుడు, వారణాసిలో విశ్వేశ్వరుడు, గౌతమీతటంలో త్యంబకేశ్వరుడు, చింతాభూమిలో వైద్యనాథుడు, అయోధ్యవద్ద దారుకావనంలో రామేశుడు, మరియు దేవసరోవరంలో ఘృష్ణేశ్వరుడు). ఎవరైతే ప్రతినిత్యము ఉదయాన్నే లేచి ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రాన్ని చదువుతారో వారికి ముక్తి లభిస్తుంది. మరియు ద్వాదశలింగాల పూజ చేయటం వల్ల అన్ని వర్ణాల వారికి దుఃఖవిమోచన కలుగుతుంది. పూజలో సమర్పించే నైవేద్యం తింటే సర్వ పాపాలు క్షణంలో భస్మం అయిపోతాయి.

            ద్వాదశ జ్యోతిర్లింగాల్లో లింగానికి జ్యోతి అనే పేరు ఎందుకు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాము. ఒక్కొక్క శివలింగంలో సూర్యుడు అగ్ని మరియు దీపజ్యోతి ఉంటాయి. ఆ మహాదివ్యజ్యోతి యొక్క రూపాలే ఈ ద్వాదశజ్యోతిర్లింగాలు. వీటిని చూస్తే ప్రతిరోజు తెలియని ఒక ఆనందం మనసుకు కలుగుతుంది.

         "ఓం తత్సవితుర్వరేణ్యం" అనే ఈగాయత్రీ మంత్రంలో బుద్ధికి ప్రేరణ ఇచ్చే సూర్యుని సర్వ శ్రేష్టమైనది తేజో రూపాన్ని వర్ణిస్తారు. ఈ మంత్రాన్ని జపించడం వల్ల మనిషిలో ఆత్మజ్యోతికి దివ్యశక్తి ప్రాప్తిస్తుంది.

          సూర్యశక్తిలోని తేజస్సు దాని నుండి లభించే వేడి ఎంత లాభదాయకమో వివరించడం చాలా కష్టం. అట్టి భాస్కరుని జ్యోతికి మేము ప్రణమిల్లుతున్నాం. సూర్యోపాసన, ఆర్ఘ్యదానం ఇస్తున్నాం. సూర్యజ్యోతి ఒక్కటే ఏకైక సత్యము. అదే నిత్యము.

      "అగ్ని" కూడా ఒక మహా జ్యోతి. పృథ్వితలంలోని సమస్త ధర్మాలు ఈ అగ్నిజ్యోతికి తలవంచుతాయి. అగ్ని ఉపయోగాలు ప్రయోజనాల గురించి ఎంత చెప్పినా సరిపోదు.

"శుభం కరోతి కల్యాణం ఆరోగ్యం ధనసంపద

శత్రు బుద్ధి వినాశాయ దీప జ్యోతి నమోస్తుతే"

      ఈ విధంగా 12 జ్యోతిర్లింగాల దర్శనం చేసుకోవటం వల్ల అజ్ఞానరూప అంధకారం నశిస్తుంది. మనోవాంఛ సిద్ధిస్తుంది. అలాగే సర్వజనులకు సుఖం, శాంతి, ప్రశాంతత ప్రాప్తిస్తాయి.


  English Language  


Jyotirlingas-Glory of Jyoti


     Jwalamukhi is a shrine located in the Kangada Ghats in the Himalayas. There appears a great cauldron that is constantly shining from the earth. Sakshattu Parameswara ౼ Shubhankara ౼ Shankara is manifested in that glorious form. Devotees keep coming in droves to visit that sacred torch. This miracle of the cauldron appears in many places. Fairs are held at that place for darshan. These are the positions


" Saurāṣṭrē sōmanāthaṁ cha, śrīśailē mallikārjunam ||


 ujjayin'yāṁ mahākāḷaṁ ōṅkārētvamallēśvaram ||


 paraḷyāṁ vaidyanāthan̄ca ḍākin'yāṁ bhīmaśaṅkaraṁ ||


 sētubandhēturāmēśvaraṁ nāgēśaṁ dārukāvanē ||


 vāraṇāsyāntu viśvēśaṁ tyambakaṁ gautamītaṭē || 


himālayētu kēdāraṁ ghr̥ṣṇēn̄ca viśālakē ||" 


        In ancient times all these places may have looked like "volcanoes" but now magnificent "Shiva temples" have been built here. Mahadev means the glory of the glorious holy places of the Dvadasajyotirlingas. Devotees flock to see all the Jyotirlingas.


         These 12 Jyotirlingas appear in various forms, 2 on the seashore, 3 on the river banks, 4 on the mountain tops, and three on the plains villages. Each area is described individually.


            While the most notable of which is the main genders dvadasa Jyothirlinga anekacotla earth, namely: - (saurastranlo Somnath, Srisailam mallikarjunudu, Ujjain mahakaludu, vindhyapradesanlo onkaresvarudu, himalayasrngalapai kedaram dakinilo bhimasankarudu, Varanasi visvesvarudu, gautamitatanlo tyambakesvarudu, cintabhumilo vaidyanathudu, ayodhyavadda darukavananlo ramesudu, and devasarovaranlo ghrsnesvarudu). Those who get up every morning and recite the Dvadasa Jyotirlinga hymn will be liberated. And the worship of Dvadashalingas brings sorrow to those of all castes. All the sins of those who eat the offering offered in worship will be burnt in an instant.


            Let us now find out why the name Jyoti came to the gender in the twelve Jyotirlingas. Each Shivalingam contains the sun, fire and torch. These Dvadasa Jyotirlingas are the forms of that Mahadivyajyoti. Seeing these brings an unknown joy to the mind every day.


         In the Igayatri mantra "Ōṁ tatsaviturvarēṇyaṁ" the omnipotent Tejo form of the sun which inspires the mind is described. Chanting this mantra gives access to the divine power of enlightenment in man.


          The brilliance of solar energy makes it very difficult to describe how beneficial the heat obtained from it is. We pay homage to the flame of Atti Bhaskara. We are giving sun worship and charity. Sunlight is the only truth. The same eternity.


      "Agni" is also a great cauldron. All the virtues of the earth are the head of this fire. It is not enough to say much about the benefits of fire.


"Śubhaṁ karōti kalyāṇaṁ ārōgyaṁ dhanasampada

 śatru bud'dhi vināśāya dīpa jyōti namōstutē"


      In this way, seeing the 12 Jyotirlingas, the ignorant darkness will disappear. Prepares for passion. As well as access to happiness, peace and tranquility for all.