Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

Brahmaputhra nadhi pushkarudi story బ్రహ్మపుత్రా నది పుష్కరుడి కధ వృత్తాంతం (beside kamakya ammavari temple)

              ◀️            ▶️  

            

Read this story తెలుగు / English 


బ్రహ్మపుత్రానది పుష్కరాలు


     పూర్వం తుందిలుడు అనే మహర్షి  శ్రీమన్నారాయణునికై తపస్సు చేసి శ్రీమహావిష్ణువును ప్రసన్నం చేసుకున్నారు. విష్ణుమూర్తి అనుగ్రహించే తుందిలుడు మూడున్నర కోట్ల తీర్ధ రాజ్యములకు పుష్కరుడుగా ప్రసిద్ధి చెందాడు.


                       చతుర్ముఖ బ్రహ్మ సృష్టిని సృష్టిస్తున్నపుడు ఆదిలో శ్రీమన్నారాయణుని ఆశ్రయించి ఆ పుష్కరుడిని తనకు ఆదిన గావింపమని ప్రార్ధించాడు. ఆ తర్వాత చాలాకాలం గడిచిన తర్వాత బృహస్పతి బ్రహ్మను మెప్పించి పుష్కరుడిని తనతో పంపించమని వరం కోరెను. వరం కారణంచేత బ్రహ్మదేవుడు - పుష్కరుడుని బృహస్పతి తో కలిసి వెళ్ళమని ఆజ్ఞాపించెను. కానీ పుష్కరుడు బ్రహ్మను వదిలి వెళ్ళుటకు ఇష్టపడలేదు. 


              వరం ఇచ్చిన కారణం చేత బ్రహ్మదేవుడు బృహస్పతితో ఈ విధంగా పలికెను: బృహస్పతి నువ్వు ఏ రాశిలో ప్రవేశిస్తావో మొదటి 12 రోజులు చివరి 12 రోజులు (పుష్కర కాలం) మిగిలిన రోజుల్లో మధ్యాహ్నం 4 ఘడియలు మాత్రం పుష్కరుడు నీతో ఉంటాడు - అని బ్రహ్మ దేవుడు మాట ఇస్తారు. దాని ప్రకారం ఈ సమయంలో దేవగణాదూలందరితో పుష్కరుణ్ణి అనుసరించాలని, అలాగే పుష్కరుడిని నేను కూడా అనుసరిస్తానని బృహస్పతితో చెప్పెను. అస్సాం రాష్ట్రంలో గౌహతి పట్టణమునందు బ్రహ్మపుత్రానది ప్రవహించుచున్నది.


                (అలాగా 2019 లో వచ్చిన బ్రహ్మపుత్రానది పుష్కరాలు గురించి తెలుసుకుందాము)


             శ్రీవికారి నామ సంవత్సర కార్తీక మాసం శుద్ధ నవమి మంగళవారం శ్రీ పుష్కరుని తో కలిసి బృహస్పతి ధనుస్సు రాశిలో ప్రవేశించుట వలన బ్రహ్మపుత్రా నది పుష్కరములు తేదీ 5-11-2019 నుండి ప్రారంభమై 16-11-2019 వరకు జరుగును.


                    హిందువులు సనాతన ధర్మ మార్గాన్ని అనుసరిస్తూ కర్మ సిద్ధాంతం ద్వారా మోక్షప్రాప్తిని పొందుచున్నారు. ధర్మ, జ్ఞాన, భక్తి మార్గములలో జీవనం ఎంత ముందుకు సాగిన- మనకు తెలిసో తెలియకో ఏదో ఒక తప్పు చేస్తూ ఉంటాము. ఈ పాపం తొలగిపోవడానికి పుష్కర స్నానాలు సూచించారు. సంవత్సరంలో ఒక్కో నదికి వచ్చే పుష్కరాలలో పుష్కర స్నానం చేస్తే పుణ్య ఫలితం వస్తుంది. ఈ సమయంలో పుష్కర స్నానం సమస్త మూడున్నర కోట్ల తీర్ధాలలో స్నానం చేసిన పుణ్యం - పుష్కర స్నానం ఇస్తుంది. అలాగే పుష్కర కాలంలో పిండ ప్రధానం, పుష్కర తర్పణము ఆచరించేవారికి మంచి సంతానములు, సకల సౌభాగ్యములు కలుగును. 


                    బ్రహ్మపుత్రా నది పుష్కరాలలో అస్సాం రాష్ట్రంలో లో గౌహతి పట్టణం నందు బ్రహ్మపుత్రా నది పుష్కరాలను నిర్వహించుచున్నారు. ఈ ప్రాంతం అష్టాదశ శక్తి పీఠములలో ఒకటైన శ్రీ కామాఖ్య అమ్మవారి ప్రసిద్ద దేవాలయము కలదు. ఇక్కడ పుష్కర స్నానం చేస్తే సకల శుభాలు, అష్ట ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు పొందగలరు. శుభం.



Regards
soujanyam.blogspot.com


ఇతర స్తోత్రములు

శ్రీ మహాలక్ష్మి అష్టకమ్

కనకధారా స్తోత్రమ్

ద్వాదశ జ్యోతిర్లింగా స్తోత్రమ్

నవరత్నామాలిక స్తోత్రం 

సరస్వతి స్తోత్రము

శ్రీ ఆంజనేయ దండకం

శ్రీ మహావిష్ణు అష్టభుజ పంచాయుధ స్తోత్రం

శ్రీ శివ పంచాక్షరీ స్తోత్రం

శ్రీరావణాకృత శివతాండవ స్తోత్రం

శ్రీ భ్రమరాంబికాష్టకం

శ్రీమహిషాసుర మర్దినీ స్తోత్రం

శివమానస పూజాస్తోత్రం



The Brahmaputra is the Pushkara


     Formerly a sage named Thundiludu performed penance for Srimannarayan and pleased Sri Mahavishnu. Thundilu, blessed by Vishnu, is known as the Pushkar of the three and a half crore Tirtha kingdoms.


                       When Chaturmukha Brahma was creating, he resorted to Srimannarayana in the beginning and prayed that Pushkar would bless him. After a long time after that, Jupiter persuaded Brahma and asked for the blessing to send Pushkar with him. Due to the boon, Brahma ordered Pushkar to go with Jupiter. But Pushkar did not want to leave Brahman.


              For the reason given by the boon, Lord Brahma spoke to Jupiter: Lord Jupiter promises that the first 12 days of the zodiac in which you enter, the last 12 days (Pushkara period) and the rest of the days at 4 o'clock in the afternoon, Pushkara will be with you. Accordingly I told Jupiter that Pushkaruni should follow with all the deities at this time, as well as I would also follow Pushkar.
The Brahmaputra flows through the town of Guwahati in the state of Assam.


                (Also let's learn about the Brahmaputra Pushkars that came in 2019)





             The Brahmaputra River Pushkars will be held from 5-11-2019 to 16-11-2019 as Jupiter enters the Sagittarius constellation along with Sri Pushkar on Shuddha Navami on the Karthika month of Srivikari Nama year Karthika.


                    Hindus follow the path of orthodox dharma and attain salvation through the doctrine of karma. How far life has come in the path of Dharma, Jnana, Bhakti- whether we know it or not we are doing something wrong. Pushkar baths are suggested to get rid of this sin. Bathing in the Pushkars that come to each river in the year brings a holy result. Pushkara bath at this time gives the virtue of bathing in all the three and a half crore tirthas - Pushkara bath. Also, during the Pushkara period, those who practice fetal prime and Pushkara Tarpanam will have good offspring and all good fortune.


                    Brahmaputra River Pushkars The Brahmaputra River Pushkars are located in the town of Guwahati in the state of Assam. The place is home to the famous temple of Sri Kamakhya Amma, one of the Ashtadasha Shakti Peethas. If you bathe in Pushkar here, you can get all the auspicious and auspicious auspiciousness and longevity. Good luck.


Regards