◀️ ▶️
నవరత్న మాలికా స్తోత్రం
ఆదిశంకరచార్య స్వర పరిచిన నవరత్నమాలిక స్తోత్రం ( 9 రత్నాలతో ఉన్న దండం). 9 రత్నాల దండంను ఎవరు చదువుతారో వారు మోక్షాన్ని పొందుతారు. మరియు వారి కోరికలు నెరవేరుతాయి.
హారనూపుర కిరీట కుండల విభూషితా వయవ శోభినీం
కారణేశ పరమౌళికోటి పరికల్ప్యమాన పదపీఠికాం
కాల కాలఫణిపాశ బాణ ధనురంకుశా మరుణ మేఖలాం
ఫాలభూతిక లోచనాంమనసి భావయామి పరదేవతాం|| 1
గంధసార ఘనసార చారు నవ నాగవల్లీ రసవాసినీం
సాంధ్యరాగ మధురా ధరా భరణ సుందరానన శుచిస్మితాం
మంధరా యత విలోచనా మమలబాల చంద్రకృతశేఖరీ
మిందిరారమణ సోదరీం మనసిభావ యామి పరదేవతామ్ || 2
స్మేర చారుముఖమండలాం విమలగండలంబిమణికుండలాం
హారదామ పరిశోభమాన కుచభార బీరు తనుమధ్యమాం
వీరగర్వ హారానూపురాం వివిధకారణేశ వరపీఠికాం
మారవైరి సహచారిణీంమనసి భావయామి పరదేవతాం || 3
భూరిభార ధరకుండాలీంద్ర మణిబద్ధ భూవలయ పీఠికాం
వారిరాశి మణిమేఖలా వలయ వహ్నిమండల శరీరిణీం
వారి సారవహ కుండాలం గగన శేఖరీం చ పరామాత్మికాం
చారుచంద్రరవిలోచనాంమనసిభావయామి పరదేవతామ్ || 4
కుండల త్రివిధకోణ మండల విహార షడ్దళ సముల్లసత్
పుండరీక ముఖబేదినీం తరుణచండభాను తడిదుజ్వలాం
మండలేందు పరివాహితా మృతతరంగిణిమరుణరూపిణీం
మండలాంత మణిదీపికాం మనసిభావయామి పరదేవతామ్ || 5
వారణా ననమయూరవాహ ముఖ దాహవారణపయోధరం
చారణా ది సురసుందరీ చికుర శేఖరీకృత పదాంఋజాం
కారణాధిపతి పంచక ప్రకృతి కారణప్రథమ మాతృకాం
వారణాంత సుఖపారణాం మనసి భావయామిపరదేవతామ్ || 6
పద్మ కాంతిపదపాణిపల్లవపయోధరా నన సరోరుహాం
పద్మరాగ మణిమేఖలా వలయినీ విశోభితనితంబినీం
పద్మసంభవ సదా శివాంతమయ పంచరత్న పద పీఠికాం
పద్మినీం ప్రణవరూపిణీంమనసిభావయామి పరదేవతామ్ || 7
ఆగమ ప్రణవపీఠికా మమల వర్ణ మంగళ శరీరిణీమ్
ఆగమా వయవ శోభినీ మఖిలవేద సారకృత శేఖరీం
మూలమంత్ర ముఖమండలాం ముదితనాద బిందు నవయౌవనాం
మాతృకాం త్రిపురసుందరీం మనసిభావయామి పరదేవతామ్ || 8
కాలికా తిమిర కుంతలాంత ఘన భృంగ మంగళ విరాజినీం
చూళికా శేఖరమాలికా వలయ మల్లికా సురభిసౌరభాం
కాలిక మధురగండమండలం మనోహరా నన సరోరుహాం
కాళిక మఖిలనాయికాం మనసిభావయామి పరదేవతామ్ || 9
నిత్య మేవ నియమేనా జల్ఫాతం భుక్తి ముక్తి ఫలదా మభీష్టదాం
శంకరేణ రచితాం సదాజపేత్ నామరత్న నవరత్నమాలికామ్ || 10