Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

నల్లకల్వ లక్ష్మీనరసింహస్వామి క్షేత్ర మహాత్యం

నల్లకల్వ  లక్ష్మీనరసింహస్వామి క్షేత్ర  మహాత్యం :      

      భూప్రపంచంలో విష్ణుస్వరూపమైన నరసింహస్వామికి అనేక చోట్ల ప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయి. వీటిలో ఒక్కో ఆలయం ఓ ప్రత్యేకమైన విశిష్టత, చరిత్రను సంతరించుకున్నాయి.

          ఈ నేపధ్యం లోనే ఆత్మకూరు మండలం నల్లకాల్వ గ్రామ సమీపంలో వెలసిన శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి అరుదైన ఇతిహాస నేపధ్యం వుంది. అయితే లక్ష్మీనరసింహ స్వామి ఆలయాల్లో మరెక్కడ లేనివిధంగా స్వామి అమ్మవార్లు పాణిమట్టంపై కొలువుతీరి ముందుభాగంలో విష్ణుస్వరూపంగా, వెనకభాగంలో శివలింగాకృతిలో (శివకేశవుల రూపంలో) భక్తులకు దర్శమిస్తూ పూజలందుకుంటున్నారు.

          ఈ ఆలయంలో ప్రతిరోజు నిత్య పూజలతో పాటు స్వామివారికి ఇష్టపూర్వకమైన శనివారం, ప్రత్యేక పర్వదినాల్లో విశేష పూజలను నిర్వహిస్తారు. అదేవిధంగా ప్రతిఏటా నరసింహస్వామి జయంతి వేడుకలను, స్వాతి నక్షపూజలను వైభవంగా జరిపించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఆలయానికి చారిత్రాత్మక ఆధారాలేవి లేనప్పటికీ ఇతిహాసాల్లో పలు విషయాలు ప్రచారంలో ఉన్నాయి.

 ఆలయ మహత్యంపై ఐతిహాస నేపధ్యం

                పూర్వం నల్లకాల్వ గ్రామపరిసర ప్రాంతమంతా అరణ్యంగా ఉండేది. ఇక్కడే కొందరు వైష్ణవ, శైవ మునులు ఎవరికి వారు అటవీ ప్రాంతంలోని ప్రశాంతమైన వాతావరణంలో తపస్సును ఆచరించేవారు. ఈ క్రమంలో వారిలో ఓ అనుమానం మొదలైంది. లయం చేసేవాడు శివుడు కాబట్టి శివుడే గొప్ప అని శైవులు,

            మోక్షం ప్రసాదించేవాడు విష్ణుమూర్తెనని కాబట్టి విష్ణువే గొప్ప అంటూ వైష్ణవులు ఇలా ఎవరికివారు భిన్నవాదనలకు దిగుతారు.

               ఈ క్రమంలోనే ఇరువర్గాలకు చెందిన మునులు ఓ వృద్ధ ముని వద్దకు వెళ్లి తమ వాదనను పరిష్కరించాలని విన్నవిస్తారు. దీంతో ఆ వృద్ధ ముని ఒక్కరోజు ఆలోచించి తెల్లవారురూమునే సమాధానం చెబుతానని వారికి సూచిస్తారు. అయితే వృద్ధముని నిద్రిస్తుండగా స్వప్నంగా నరసింహస్వామి కనిపించి తనను పాణి మట్టంపై విష్ణు,శైవ ప్రతిరూపాలుగా కొలువతీర్చాలని ఆజ్ఞాపిస్తాడు.

                   ఈ విషయాన్ని మరుసటి రోజు వృద్ధముని వైష్ణవ, శైవ మునుల దృష్టికి తీసుకెళ్లగా వారు దీన్ని అంగీకరించారు. ఈ విధంగా నల్లకాల్వ నరసింహస్వామి ఆలయంలో రాతితో చెక్కబడిన పాణి మట్టంపై విష్ణుస్వరూపంగా లక్ష్మీసహిత నరసింహస్వామి, వెనకభాగం లింగాకృతిలో పూజలందుకోవడం విశేషమని చెప్పవచ్చు. కాగా హిరణ్య కశపున్ని సంహరించిన అనంతరం స్వామివారు నల్లకాల్వలోని నరసింహస్వామి ఆలయ సమీపంలోని ఓ కాల్వలో ప్రవహిస్తున్న నీటిలో రక్తపు మరకల చేతుల్ని శుద్ధి చేసుకుంటారు.

                     సంస్కృతంలో రక్తాన్ని నల్ల అని పిలుస్తారు. అలాగే ఆ కాల్వలో కలువ పూలు పూయడంతో నల్లకలువగా నామకరణం జరిగినప్పటికీ కాలక్రమంలో నల్లకాల్వ అని పేరు స్థిరపడినట్లు ప్రచారంలో వుంది. కాగా నల్లకాల్వ లక్ష్మీనరసింహస్వామి క్షేత్ర మహత్యంపై పద్మపురాణంలో ప్రస్థావించడం గమనార్హం.

సూర్య కిరణాలు సృశిస్తే.. లింగాకృతిలో ప్రతిబింబం

               ఆత్మకూరు ప్రాంతంలో అత్యంత విశిష్టత కలిగిన నల్లకాల్వ శ్రీలక్ష్మి నరసింహ క్షేత్రంలో స్వామి అమ్మవార్ల మూలవిరాట్ ను ఉత్తరయానంలో సూర్య కిరణాలు స్పర్శిస్తాయి. తూర్పు ద్వారంగా దర్శనభాగ్యం కల్గించే స్వామి అమ్మవార్లపై ఉత్తరాయణంలోని పుష్య మానం నుంచి ఆషాడమాసం వరకు ఉదయం 6.30గంటల నుంచి గంటల సమయం మధ్యలో ఈ అపురూపమైన దృశ్యం సాక్ష్యాత్కారిస్తోంది.

                     గర్బాలయం ఎదుట 120 అడుగుల దూరం ముఖమంటపం, కళ్యాణ మంటపం ఉన్నప్పటికీ వాటిని దాటి సూర్య కిరణాలు గర్భాలయంలోని మూలవిరాట్ పై ప్రసరించడం అద్భుతమని చెబుతారు.

                  ఈ కిరణాలు స్వామి అమ్మవార్లపై పడటంతో గర్భాలయ గోడలపై మూలవిరాట్ నీడ లింగాకృతిలో ప్రతిబింబిస్తోంది. ఇలాంటి అపురూమైన దృశ్యాన్ని తిలకించేందుకు ఉత్తరాయణ మాసాల్లో ఉదయాన్నే భక్తులు ఆలయానికి విశేషంగా తరలివస్తారు.


English


Nallakalva Lakshminarasimhaswamy Temple Massacre:


      There are many famous temples dedicated to Lord Narasimhaswamy in the world. Each of these temples has a unique significance and history.


          It is against this backdrop that the Srilaxminarasimhaswamy Temple, located near the village of Nallakalva in the Atmakuru Zone, has a rare epic background. However, like nowhere else in the temples of Lakshminarasimha Swami, the Swami Ammavars are worshiped on the water level in the form of Vishnu on the front and in the form of Shivalinga (in the form of Sivakesavas) on the back.


          The temple conducts daily pujas as well as special pujas on Saturdays and special festivals, which are dear to the Swami. Similarly, every year Narasimhaswamy Jayanti celebrations and Swati Naksha Pujas are celebrated in grand style. Although there is no historical evidence for the temple, many things in the legends are propagated


Legendary background on the significance of the temple


                Formerly Nallakalwa was a jungle all over the village. It is here that some Vaishnava and Shaiva monks practiced penance in the serene atmosphere of the forest. In this order a suspicion began among them. The Shaivites say that Lord Shiva is great because Lord Shiva is the rhythm maker.


            Vaishnavism argues that Vishnu is great because he is the giver of Nirvana.


               It is in this order that the Munus of both the parties go to an old Muni and ask him to settle their argument. With this, the old sage suggests that one day he will think and answer in the morning. However, while the old man was asleep, Narasimhaswamy appeared in a dream and ordered him to measure himself as a replica of Vishnu and Shaiva on the water level.


                   The next day the old man brought the matter to the attention of the Vaishnava and Shaiva monks and they accepted it. Thus Narasimhaswamy with Lakshmi in the form of Vishnu on the level of the water carved in stone in the Nallakalva Narasimhaswamy temple is worshiped in the form of a linga on the back. After slaying Hiranya Kasap, the Swami cleanses his hands of blood stains in running water in a canal near the Narasimhaswamy Temple in Nallakalwa.


                     In Sanskrit blood is called black. It is also believed that the canal was renamed as Nallakaluva due to its lily flowers, but the name Nallakalva was established over time. It is noteworthy that Nallakalva Lakshminarasimhaswamy mentions the greatness of the temple in the Padma Purana.


If the sun's rays are created .. reflection in the gender


Swami Ammavarla Moolaviratha is touched by the sun's rays during the Uttarayana journey at the Nallakalva Srilakshmi Narasimha Temple, which is very prominent in the Atmakuru region. Swami Ammavarla, the gateway to the East, witnesses this spectacular sight from 6.30 am to noon, from Pushya Manam in the north to Ashadamasam.


                     Although there is a 120 feet front porch and a wedding pavilion in front of the sanctum sanctorum, it is said that the rays of the sun passing over them are wonderful to radiate over the moolavirat in the sanctum sanctorum.


                  As these rays fall on Swami Ammavar, the Moolaviratha shadow on the walls of the sanctum sanctorum is reflected in the linga. Devotees flock to the temple early in the morning during the northern months to witness such a spectacular sight.