ముక్కామల మానసా దేవి
Discovery of Manasa devi Temple story //ముక్కామల మహా క్షేత్రం.
Mukkamala (village)
Pincode : 534330
ముక్కామల మహాక్షేత్రాని మానసాదేవి పీఠంగా పిలుస్తారు.
ఎందుకంటే ఇక్కడ మానసాదేవి ధ్యానం చేసినట్టుగా స్థలపురాణం. ఈ ముక్కామల
మహాక్షేత్రం ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాలో, పెరవలి మండలంలో
ముక్కామల అనే గ్రామంలో ఈఆలయం ఉంది. ఈ ఆలయంలో అపురూపమైన నాగబంధాలు ఉన్నాయి.
ఇక్కడ అష్టాదశశక్తి పీఠాలు గురించి, నవనాగసహిత మానసాదేవి గురించి, వాసవి
కన్యకా పరమేశ్వరి అమ్మవారు, సుబ్రమణ్యేశ్వర స్వామి, కామదేనువు ఇక్కడ చాలా
ముఖ్యమైనవి.
ఆలయం బయట ఇద్దరు మహర్షులు తాళపత్రాలు చేత్తో
పట్టుకుని మనకు ఆశీర్వాదం ఇస్తున్నట్టు ఉంటారు. ఆలయంలోకి ప్రవేశించక ముందు
మనకు కుడిచేతివైపునా ప్రత్యంగిరా అమ్మవారి ఆలయం కనిపిస్తుంది. ప్రత్యంగిరా
అమ్మవారికి ఎక్కువగా పూజలు గాని ఆలయాలు గాని ఉండవు. సాధారణ వ్యక్తులు
అమ్మవారిని పూజించటానికి వీలు లేదు. ఉగ్రరూపంతో ఉన్న దేవి కారణంగా ఈ
అమ్మవారికి ఆలయాలు కూడా ఉండవు. ఈ అమ్మవారిని సాక్షాత్తు శ్రీరాముడు,
విష్ణుమూర్తి కూడా పూజించారు. ఇక్కడ అమ్మవారికి ఎదురుగా ధ్వజస్తంభం చుట్టూ
సతీసమేతంగా భైరవులు ఉన్నారు.
ప్రత్యంగిరా అమ్మవారి దర్శనం చేసుకుంటున్నప్పుడు
సర్వేశ్వరస్వామి, సింహగణపతి, సింహాదిత్యుడు, ఉగ్రనరసింహస్వామి వార్లు, శ్రీ
చక్రం - అమ్మవారి దగ్గర దర్శనమిస్తాయి. భారతీయ పురాణం ప్రకారం ముందుగా
నాగ,నాగినీలు ఆలయంలో దర్శనమిస్తారు. (కొబ్బరికాయ కొట్టి ప్రదేశం వద్ద
నాగ,నాగినీలు ఉన్నారు). ఎడమచేతి వైపున మనకు సతీసమేతంగా నవగ్రహాలు ఉంటాయి.
ద్వారంకి కుడిచేతి వైపున నవనాగసహిత మానసాదేవి అమ్మవారు, శ్రీచక్రం ఈ ఆలయంలో
దర్శనమిస్తారు. ఈ ఆలయానికి సమీపంలో మానసాదేవి భర్త జరత్కార మహర్షి ఆలయం
కూడా ఉంది. ఈ ఆలయంలో మానసాదేవి, జరత్కారమహర్షి, ఆస్తికుడు, సతీసమేతంగా
రాహుకేతువులు, ద్వాదశ కాలనాగులు ఈ ఆలయంలో దర్శనమిస్తారు.
జరత్కార మహర్షి ఆలయానికి ఎదురుగా అష్టాదశ శక్తిపీఠాలు ఒక
ధ్వజస్తంభం చుట్టూ చాలా చక్కటి ఆకృతితో చెక్కబడి ఉంటుంది. అష్టాదశ శక్తి
పీఠాలు బాలనాగత్రిపుర సుందరి అమ్మవారి ఆలయానికి ఆనుకొని ఉంటుంది.
బాలనాగత్రిపుర సుందరి అమ్మవారి దగ్గర రెండు శ్రీ చక్రాలు ఉంటాయి ఒకటి
అమ్మవారి దగ్గర, రెండోవది త్రిశూలం దగ్గర గర్భగుడి బయట కనిపిస్తుంది.
అమ్మవారికి ఎడమచేతి వైపున రాజ్యశ్యామల అమ్మవారు, కుడి చేతి వైపున
ద్రోమవారాహి అమ్మవారు ఉంటారు. అంతేకాకుండా ఇక్కడ శివాలయం కూడా ఉంది.
శివాలయంకి ఎదురుగా బ్రహ్మదేవుడి ఆలయం కూడా ఉంది. చతుర్ముఖ బ్రహ్మకు నాలుగు
సింహద్వారాలతో ఈ ఆలయం దర్శనం ఇస్తాయి.
Read : ప్రపంచ కాలన్ని ప్రాచీనులు ఎన్ని యుగాలుగా విభజించారు.
మనసాదేవీ ఆలయానికి వెనకాతల ఒక పెద్ద శివలింగం, ఆ శివలింగం చుట్టూరా
నాగశిలల ఒక చిన్న కొలనులో కనిపిస్తుంది. ఇక్కడ భక్తులు తమ స్వహస్తాలతో
అభిషేకం చేసుకోవచ్చు. కామదేనువు, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, వాసవీ కన్యకా
పరమేశ్వరి అమ్మవారి గురించి తెలుసుకుందాం. రాజమార్గం గుండా లోపలికి
వెళ్ళినప్పుడు వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారికి చుట్టూరా దశమహావిద్యలు
ఉన్నాయి. ఈ ఆలయములో మూలవిరాట్ల దర్శనం దీపపు కాంతులలో మాత్రమే దైవదర్శనం
జరుగుతుంది.
ముఖ్యమైనవి.
ఆలయం బయట
1. కామదేనువు : గోవులకు మాతగా భావిస్తారు. హిందూ సాంప్రదాయం ప్రకారం కామధేనువును కోరికలు తీర్చే దేవతగా కొలుస్తారు.
2. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు : ఇక్కడ అమ్మవారు ఆత్మాహుతి చేసుకున్న కారణంగా ఈ ప్రదేశాన్ని మోక్షగుండంగాా పిలుస్తారు.
3. తపోషణ్ముఖేశ్వర స్వామి వారు (సుబ్రహ్మణ్యేశ్వర స్వామి) :
ప్రముఖ షణ్ముఖ దేవాలయాలు లాగానే ఈ దేవాలయం కూడా ఎంతో కీర్తి ప్రతిష్టలు
పొందింది. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారిని శ్రీ తపోషణ్ముఖేశ్వర స్వామి
వారుగా భక్తులు కొలుస్తారు.
ఈ ముగ్గురు దేవతలు నుండి ధ్వజస్తంభం వరకు మధ్యలో ఏడు
చక్రాలు ఉన్నాయి. (ప్రత్యంగిరా అమ్మవారి దగ్గర + వాసవి మాత దగ్గర + బాలనాగ
త్రిపుర సుందరి అమ్మవారి దగ్గర రెండు చక్రాలు). ఈ క్షేత్రంలో మొత్తం 11
శ్రీ చక్రాలు ఉన్నాయి. అమ్మవారి యొక్క రేఖ స్వరూపమే శ్రీ చక్రం. ఈ చక్రంలో
కామేశ్వరి, కామేశ్వర్లు ఇద్దరు ఉంటారు. ఈ శ్రీచక్రంలోన భూమి ప్రస్థానం,
భూమి పైన ఉన్న ఆకాశ ప్రస్థానం గురించి, ఆకాశం పైన ఉన్న కైలాస ప్రస్థానం
గురించి, కైలాసం పైన ఉన్న అర్థమేరు ప్రస్థానం గురించి, అర్మేరుకి ఆపైన
ఉన్న పద్మ ప్రస్థానం గురించి, పద్మప్రస్థానంకి పైన ఉన్న మేరుప్రస్థానం
గురించి ఈ శ్రీచక్రంలో ఉన్నాయి.
దశ మహా విద్యలు:
1. త్రిపురాదేవి అమ్మవారు : ఈ అమ్మవారిని కొలిస్తే మనశ్శాంతి కలుగుతుంది. శీఘ్ర వివాహం జరుగుతుంది. సంతానం కలుగుతుంది.
2. శ్రీ భువనేశ్వరి అమ్మవారు : ఈ అమ్మవారిని సంతృష్టి గురించి, ఈ మూడు భువనాలు పైన ఆధిపత్యం గురించి కొలుస్తారు.
3. శ్రీ మాతంగి దేవి : ఈ అమ్మవారిని కొలిస్తే త్రైలోక్యం పైన విజయం గురించి, కీర్తి వృద్ధి గురించి, రాజకీయ విజయం గురించి ఈ అమ్మవారిని కొలుస్తారు.
4. శ్రీ త్రిపుర భైరవి దేవి: ఈ అమ్మవారిని పూజిస్తే దీర్ఘవ్యాధి నాశనమవుతుంది. మనశ్శాంతి కలుగుతుంది. గ్రహ దోష నివారణ ఉంటే తొలగిపోతుంది.
5. శ్రీ కమలాత్మిక దేవి : ఈ అమ్మవారిని భక్తులు విశేషంగా ధనధాన్యభివృద్ధి కోసం పూజిస్తారు.
6. శ్రీ ధూమావతీ దేవి : ఈ అమ్మవారిని కొలిస్తే అలక్ష్మి నాశనం కలుగుతుంది. తదుపరి ఆరోగ్యము, అపమృత్యువు ఏమైన ఉంటే పోతుంది.
7. శ్రీ బగళాముఖీ దేవి : ఈ అమ్మవారిని కొనిస్తే శత్రు స్తంభన జరుగుతుంది. వాక్సిద్ధి కలుగుతుంది.
8. శ్రీ చిన్నమస్తా దేవి
: చిన్నమస్తా అంటే ఖండించిన తల అని అర్థం. ఇక్కడ అమ్మవారికి చిన్న ముండ
అనే ఇంకో పేరు కూడా ఉంది. చినముండ అంటే ఖండించిన తల అని అర్థం. హిందూ,
మార్కండేయ పురాణం లో కూడా ఈ అమ్మవారు గురించి ప్రస్తావించారు. ప్రతి
సంవత్సరం వైశాఖ మాసం శుక్లపక్షం చతుర్దశి రోజున అమ్మవారికి పండుగలు
చేస్తారు.
ఇక్కడి కథనం ప్రకారం అమ్మవారు కోపంతో తలను ఖండించుకుని
మోక్షం పొందారని ఇక్కడి స్థల పురాణం. ఈ అమ్మవారిని కొలిస్తే అహంకార నాశనం,
మోక్ష ప్రాప్తి కూడా కలుగుతుంది.
9. శ్రీ తారాదేవి : ఇక్కడ అమ్మవారిని కొలిస్తే సర్వప్రాప్తి, పరిపూర్ణ రక్షణ కూడా కలుగుతుంది.
10. శ్రీ దక్షిణ కాళీ మాత : ఈ అమ్మవారిని కొలిస్తే శత్రు నాశనం జరుగుతుంది. జీవిత మార్గం కూడా కలుగుతుంది.
ముక్కామల మహా క్షేత్రం ని చాలా రకాల పేర్లతో కూడా
పిలుస్తారు. త్రిపద్మ క్షేత్రంగా, కులస్థాశ్రమంగా, కుమార క్షేత్రంగా,
బ్రహ్మగుండంగా, గోగర్భ క్షేత్రంగా, గోకర్ణ క్షేత్రంగా, శ్రీవాసవీమాత
ఆత్మాహుతి అయిన మోక్షగుండంగా, వైశ్యాకాశి క్షేత్రంగా, జ్వెష్ట
శైలదిగ్బాంతిగా, మానికోటిగా, ధర్మగుండంగా ఈ ప్రదేశం కీర్తి గావించింది.
Watch this video in my youtube channel
Regards:
soujanyam.blogspot.com
English Language
Discovery of Manasa devi Temple story // Mukkamala Maha Kshetra.
Mukkamala Mahakshetra is also known as the Manasadevi Kshetram. Because here is the local myth as Manasadevi meditated. Mukkamala Mahakshetra is located in a village called Mukkamala in the Peravali Zone of the West Godavari District of Andhra Pradesh. The temple has incredible nagabandhas. Ashtadashakti Peethas, Navanagasahita Manasadevi, Vasavi Kanyaka Parameswari Ammavaru, Subramanyeshwara Swamy and Kamadenu are very important here. Let's learn about these too.
Outside the temple, two sages are seen holding palm leaves in their hands and blessing us. Before entering the temple we can see the temple of Pratyangira Ammavari on the right hand side. Pratyangira Amma often has no pujas or temples. Ordinary people are not allowed to worship the goddess. There are no temples for this goddess due to her fierce goddess. These goddesses were actually worshiped by Lord Rama and Lord Vishnu. Here are the Bhairavs sat around the flagpole in front of the goddess.
While visiting Pratyangira Ammavari, Sarveshwaraswamy, Simhaganapati, Simhadityudu, Ugranarasimhaswamy Wars, Sri Chakram - appear near Ammavari.
According to Indian mythology, the Naga Naginis first appeared in the temple. (There are Naga Naganis at the place where the coconut is beaten). On the left hand side we have the Navagrahas along with Sati. On the right hand side of the gate, the Navanagasahita Manasadevi Goddess, Srichakram is seen in this temple. The Mansadevi Bharta Jagatkara Maharshi Temple is also located near this temple. The temple is dedicated to Manasadevi, Jagatkara Maharshi, the ascetic, Rahu Ketu along with Satis, and the Dvadasa Kalanagus.
The Ashtadasha Shakti Peethas in front of the Jagatkarana Maharshi Temple are carved in a very fine shape around a flagpole. The Ashtadasha Shakti Peethas are located adjacent to the Balanagatripura Sundari Ammavari Temple. The Balanagatripura Sundari Goddess has two Sri Chakras, one near the Goddess and the other outside the sanctum sanctorum near the trident. The goddess has Rajyasyamala goddesses on the left hand side and Dromavarahi goddesses on the right hand side. There is also a Shiva temple here. There is also a temple of Brahma opposite the Shiva temple. The temple has four gateways to the four-faced Brahma.
Behind the Manasadevi temple is a large Shiva lingam, which is found in a small pool of cobblestones around it. Here the devotees can be anointed with their own hands. Let us know about Kamadenu, Subrahmanyeshwaraswamy, Vasavi Kanyaka Parameswari Ammavari. Going in through the highway, the resident Kanyakaparameshwari Ammavari is surrounded by Dashamahavidyas. In this temple, the vision of the Moolavirathas takes place only in the light of the lamp.
1. Kamadenu: Considered the mother of cows. According to Hindu tradition, Kamadhenu is measured as the goddess of desires.
2. Vasavi Kanyaka Parameswari Ammavaru: This place is also known as Mokshagundanga because Ammavaru committed suicide here.
3. Taposhanmukheshwara Swamy (Subrahmanyeshwara Swamy): Like the famous Shanmukha temples, this temple is also very famous. Here Subramanya Swami is measured by the devotees as Sri Taposhanmukheswara Swami.
There are seven wheels in the middle from these three deities to the flagpole. (Two wheels near Pratyangira Ammavari + Vasavi Mata + Balanaga Tripura Sundari Ammavari). There are a total of 11 Sri Chakras in this field. Sri Chakra is the line form of the Goddess. In this cycle both Kameshwari and Kameshwar are present. In this Srichakra, there is information about the reign of the earth, the reign of the celestial body above the earth, the reign of Kailasa above the sky, the reign of Arthameru above the Kailasa, the reign of Padma above Armor, and the supremacy above the Padma.
Dasha Maha Vidyas:
1. Tripuradevi Ammavaru: If you measure these Ammavaru, you will get peace of mind. A quick marriage will take place. Offspring are caused.
2. Sri Bhuvaneswari Ammavaru: These Ammavaru are measured about satisfaction and dominance over these three Bhuvanas.
3. Sri Matangi Devi: If these goddesses are measured, they are measured about victory over the Trilogy, about fame growth, about political success.
4. Sri Tripura Bhairavi Devi: Worshiping these goddesses will cure chronic diseases. Peace of mind is caused. If the asteroid bug is removed it will be removed.
5. Sri Kamalatmika Devi: These goddesses are especially worshiped by the devotees for the development of wealth.
6. Sri Dhumavati Devi: If you measure these goddesses, Alakshmi will be destroyed. If the next health, immortality is lost.
7. Sri Bagalamukhi Devi: Killing these goddesses will bring the enemy to a standstill. Vaccination is caused.
8. Sri Chinnamastha Devi: Chinnamastha means condemned head. There is also another name for the seller, Chinna Munda. Chinamunda means the head of the condemned. These goddesses are also mentioned in the Hindu Markandeya Purana. Every year in the month of Vaishakh, on Shuklapaksham Chaturdashi, festivals are celebrated for the goddess.
According to the local legend, the goddess angrily cut off her head and got salvation. Measuring these salespeople causes ego destruction. Access to salvation also takes place.
9. Sri Tara Devi: Omnipotence is achieved by measuring the mothers here. Perfect protection is also induced.
10. Sri Dakshina Kali Mata: If you measure these goddesses, the enemy will be destroyed. The way of life is also caused.
Mukkamala Maha Kshetra is also known by many different names. The place is famous as Tripadma Kshetra, Kulasthashrama, Kumara Kshetra, Brahmagunda, Gogarbha Kshetra, Gokarna Kshetra, Mokshagunda, Vaishyakashi Kshetra, Mani Koti and Dharmagunda.
Watch the video in my youtube channel