About the wikipedia of Jaganmohini Kesava swamy temple in Andhra Pradesh
శ్రీ జగన్మోహిని కేశవ స్వామి ఆలయం
శ్రీ జగన్మోహినికేశవస్వామి వారి కథ మహత్యాన్ని మీ ముందుకు
తీసుకురావటం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్
రాష్ట్రం - కోనసీమలో తప్ప ప్రపంచంలో మరెక్కడ ఇటువంటి ఆలయం లేదు.
ఈ ఆలయం తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటకు 10 KM
దూరంలో ర్యాలీ అనే గ్రామంలో ఉన్నది. ఈ ప్రాంతం రాజమండ్రికి 40 KM
దూరంలోనూ, కాకినాడకు 74 KM దూరంలోనూ మరియు అమలాపురానికి 34 KM దూరంలోనూ
ఈఆలయం కలదు. గోదావరి యొక్క ఉపనదులుగా పిలవబడుతున్న వశిష్ఠ మరియు గౌతమి అనే
రెండు నదుల మధ్య తూర్పు, పడమర దిశలో హరిహరుల దేవాలయాలు
ఒకదానికొకటి ఎదురెదురుగా ఉన్నాయి. ఇక్కడ స్వామి వారిని జగన్మోహిని కేశవ
స్వామి వారుగా పిలుస్తారు. స్వామి వారి విగ్రహం సాలిగ్రామ ఏకశిలా
విగ్రహంగా ఉంటారు. ఈ విగ్రహం ఎత్తు 5 అడుగులు, వెడల్పు 3 అడుగులుగా
ఉంటుంది. ఈ విగ్రహంలో స్వామి వారు ముందువైపు విష్ణువుగా వెనుక
వైపు జగన్మోహినిగా ఉంటారు. ఇక్కడ స్వామివారి పాదాలచెంత నుండి గంగ చెమట
రూపంలో నిత్యం ప్రవహిస్తున్నట్లు భక్తులు ప్రత్యక్షంగా
చూడవచ్చు.
భాగవతం ప్రకారం అమృతం కోసం దేవతలు రాక్షసులు సముద్ర మథనం
జరుగుతున్నప్పుడు, అమృతం రాక్షసులకు అందకుండా ఉండేందుకు శ్రీ మహావిష్ణువు మోహినీరూపాన్ని దాల్చి దేవతలకు అనుకూలంగా అమృతాన్ని ఎక్కువగా
పంపిణీ చేస్తారు. అదే సమయంలో శివుడు జగన్మోహినితో ప్రేమలో పడతారు. విష్ణువు
యొక్క మాయని తెలియని శివుడు మోహినిని వెంబడిస్తూ ఈ ప్రాంతానికిి
చేరుకుంటారు. ఈ విషయం గమనించిన విష్ణుమూర్తి తన నిజస్వరూపాన్ని
చూపించాలని ముందువైపు విష్ణువుగా కనబడతారు వెంటనే శివుడు, విష్ణువు యొక్క
మాయని గ్రహించి ఆగిపోతారు. ఇక్కడ జరుగుతున్న కథ వృత్తాంతాన్ని బ్రహ్మదేవుడు
గమనించి వెంటనే అక్కడికి చేరుకుని శివుడిని తన కమండలంలో ఉన్న నీటితో వెనుక
భాగాన్ని పవిత్రం చేస్తారు. శివుడు ఎక్కడైతే ఆగిపోయాడో అక్కడ
స్వయంభూలింగంగా వెలిశారు. ఇక్కడ శివుణ్ణి ఉమా కమండలేశ్వరూడిగా పూజిస్తారు.
స్వామివారికి ఎదురుగా విష్ణుమూర్తి జగన్మోహిని అవతారంలో శాలిగ్రామ ఏకశిలా
విగ్రహంగా స్వయంభూ గా వెలిశారు. జగన్మోహిని అవతారం పద్మినిజాతి స్త్రీగా ఉంటుంది.
పూర్వం ర్యాలీ ప్రాంతం అంతా దట్టమైన అడవులతో ఉండేది. అప్పట్లో
ఘంటచోళుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఒకసారి రాజు వేటకు వచ్చి ఈ
ప్రాంతానికి చేరుకుని అలసిపోయి నిద్రలోకి జారుకున్నప్పుడు ఎవరో భక్తులు హరి
సంకీర్తన చేస్తున్న శబ్ధం విని కళ్ళుతెరిచి చూడగా అక్కడ ఎవరు కనిపించలేదు.
రాజుగారు తరువాత తన రాజ్యానికి చేరుకుని, ఆరోజు రాత్రి నిద్రలోకి
చేరుకున్నపుడు స్వప్నంలో విష్ణుసాక్షాత్కారం జరిగి విష్ణుమూర్తి
ఘంటశాలుడితో ఈ విధంగా పలికాడు. "రాజా నీ రాజ్యంలో ఒక రథం తయారు చేయించి
నడిపించు ఎక్కడ ఆ రథం యొక్క శీల పడిపోతుందో అక్కడ నా విగ్రహం దొరుకుతుంది.
అక్కడ గుడి కట్టించమని" చెప్పగా ఘంటసాలుడు నిద్ర నుంచి మేల్కొంటారు. మరుసటి
రోజు ఆ కళ గురించి రాజు గురువులతో చర్చించి రథం తయారు చేయించి ముందుకు
నడిపిస్తారు. ఆ రథం ఈ ప్రదేశానికి చేరుకోగానే శీల ఉడిపోయింది. వెంటనే అక్కడ
త్రవ్వగా ఒక మోహినీదేవి విగ్రహం లభిస్తుంది. ఆ విగ్రహం ఒక పక్క స్త్రీగా,
మరోపక్క పురుష రూపంలో ఉండటాన్ని చూసి ఘంటసాల చక్రవర్తి ఆశ్చర్యపోతాడు.
ఆ విగ్రహం ముందు భాగాన చిన్నశంఖం, చక్రం, గధ, పద్మం అలాగే ధరించిన
నాలుగు చేతులు, వెనకవైపు ఆభరణాలు, అలంకారాలు మాత్రమే కాకుండా చక్కటి అందంతో
పద్మినీజాతి స్త్రీకి ఉండే తెల్లటి పుట్టుమచ్చ అమ్మవారి కుడికాలు మీద
ఉంటుంది. స్వామివారి అభయ హస్తంలో చేతివేలు, అరచేతిలో రేఖలు ఉంగరాలు, గోర్లు
అలాగే చేతులో పెద్ద గథ కూడా ఉంటుంది. స్వామివారికి ఎడమవైపున శ్రీదేవి,
కుడివైపున భూదేవి అలాగే గరుత్మంతుడు రెండుపాదాల మధ్య గంగమ్మ వారి
చిన్నప్రతిమ ఉంది. ఇక్కడ చెమట రూపంలో నిత్యం గంగ ప్రవహిస్తూనేఉంటుంది. దశ
అవతారాలు అయినా మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, రామ, బలరామ,
బుద్ధ, కల్కి, తంబుర నారదుడు నాధం చేస్తున్నట్టుగా, కిన్నెర కింపురుషులు
పుష్పమాలలు వేస్తున్నట్టుగా, రంభ - ఊర్వశి నాట్యం చేస్తున్నట్లుగా,
శేషనాధుడు పడగవిప్పినట్టుగా, మోహిని సిగచుట్టూ చామంతి పువ్వు, పైట
చెంగు, చేతులకు గండపట్టీలు ఇక్కడి దేవతావిగ్రహం భక్తుల్ని మంత్రముగ్ధుల్ని
చేస్తుంది. తర్వాత ఘంటసాలుడు ఇక్కడ ఒక చిన్న ఆలయాన్ని కూడా నిర్మించాడు.
11వ శతాబ్దంలో చోళులు కూడా ఈ ప్రాంతాన్ని పాలించారు. రాజమండ్రికి వెళ్ళే
దారిలో రావులపాలెంకి దగ్గరలో ఈ ఆలయం కలదు.
ఉద్యోగబదిలి కావాలనుకునే భక్తులు ఇక్కడి స్వామివారిని దర్శనం
చేసుకుంటే ట్రాన్స్ఫర్ అవుతారని ఇక్కడి భక్తుల విశ్వాసం. ఇక్కడ స్వామి
వారికి కళ్యాణోత్సవాలు చైత్ర శుద్ధ నవమి మొదలుకొని పౌర్ణమి వరకు 7 రోజులు
కళ్యాణం చేస్తారు. మొక్కు తీరిన తర్వాత భక్తులు ప్రతినెలా వచ్చే శ్రవణ
నక్షత్రం రోజున కళ్యాణం చేయించుకుంటారు. ఇక్కడ స్వామివారు క్షేత్ర పాలకులై
ఆజన్మాంతం దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇక్కడ భక్తుల కోరికలు కూడా
నెరవేరుతాయి.
Thanks for reading...
Yours
Soujanya
Regards
www.soujanyam.blogspot.com
English language
About the wikipedia temple of Jaganmohini Kesavaswamy temple
We feel it is our good fortune that Sri Jaganmohinikeshavaswamy
brings the significance of their story to you. Because this temple is in
the state of Andhra Pradesh - there is no other such temple in the
world except in Konaseema.
The temple is located in a village called Rally, 10 km from
Kottapet in East Godavari district. The temple is located at a distance
of 40 KM from Rajahmundry, 74 KM from Kakinada and 34 KM from
Amalapuram. The temple is located between two rivers, the Vashishta and
the Gautami, which are the tributaries of the Godavari. Here the temples
of the Hariharas face each other on the east and west sides. Here the
Swami is called Jaganmohini Keshava Swami. Their idol of Swami is a
monolithic idol of Saligram. The statue is 5 feet high and 3 feet wide.
In this idol, Swami is Vishnu in the front and Jaganmohini in the back.
Devotees can directly see the river Ganga flowing in the form of sweat
from the soles of the feet of the Swami.

According to the Bhagavatam, the gods and goddesses for nectar
while the sea is brewing, the nectar is distributed mostly in favor of
the deities in the form of Sri Mahavishnu Mohini to keep the nectar out
of the hands of the demons. At the same time Lord Shiva falls in love
with Jaganmohini. Lord Shiva, who does not know the magic of Vishnu,
chases after Mohini to reach this place. Observed this thing
As
soon as Vishnu appears as Vishnu in front of him to show his true form,
Lord Shiva stops realizing the delusion of Vishnu. Brahma noticed the
story going on here and immediately went there and consecrated Lord
Shiva with water in his mandala. Lord Shiva appeared spontaneously
wherever he stopped. Here Shivuni is worshiped as Uma Kamandaleshwarudi.
In front of the Swami, Vishnu incarnates as Jaganmohini, a monolithic
idol of Shaligram. The incarnation of Jaganmohini is Padministri.
Formerly the rally was all about dense forests. At that
time a king named Ghantacholadu was ruling. Once when the king came
hunting and reached this place and fell asleep tired, someone heard the
sound of the devotees chanting and opened their eyes and saw no one
there. When the king later reached his kingdom and fell asleep that
night, Vishnu realized in a dream and said this to the bell-ringer. Make
a chariot and lead it in the kingdom of the king. My idol will be found
where the rock of that chariot falls. The bell-ringer wakes up when
told to build a temple there. The next day the king discusses the art
with the gurus and makes a chariot and leads it forward. As soon as the
chariot reached this place, the rock broke. Immediately there is an idol
of Mohini Devi excavated. The bell-ringer is astonished to see the
statue in the form of a woman on one side and a man on the other.
On the front of the statue is a small conch, a wheel, a donkey, a
padma as well as four arms worn, on the back not only ornaments and
ornaments but also on the right hand of the white mole mole of the
Padmini woman with fine beauty. Swami's Abhaya hand has a finger, lines
on the palm, rings, nails as well as a large ghat in the hand. On the
left side of the Swami is Sridevi, on the right side is Bhudevi as well
as on the two feet of Garutmantu there is a miniature of Gangama. The
Ganges is constantly flowing here in the form of sweat. The stage
incarnations are Matsya, Kurma, Varaha, Narasimha, Vamana, Parasurama,
Rama, Balarama, Buddha, Kalki - as Tamburanaradu is dancing, Kinnera
Kimpurushu is laying flowers, Rambha - Urvashi is dancing, Seshanadhu is
chanting, , Handcuffs The idol of the deity here enchants the devotees.
Later the bell-ringer also built a small temple here. The region was
also ruled by the Cholas in the 11th century. The temple is located near
Ravulapalem on the way to Rajahmundry.
Devotees who want to change jobs believe that they will be
transferred if they visit the Swami here. Here the Swami celebrates
their marriage for 7 days from Chaitra Shuddha Navami to the full moon.
After the nose is done the devotees get married on the day of Shravana
Nakshatra which comes every month. Here the lords look after the field
rulers for the rest of their lives. Here the wishes of the devotees are
also fulfilled.