⬅️ ఆచంటీశ్వర క్షేత్ర మహత్యము ➡️
ప్రచురణ : sep 05 2021
పశ్చిమగోదావరి జిల్లా ఆచంట క్షేత్రములో వేంచేసియున్న శ్రీ రామేశ్వర స్వామి వారి ఆలయ చరిత్ర
దక్షిణ భారతావనిలో ప్రసిద్ధి గాంచిన పుణ్య క్షేత్రాలలో ''ఆచంటీశ్వర క్షేత్రం'' ఒకటి. ఈ క్షేత్రం గోదావరి తీరమునకు కొద్ది దూరమునకు గల పూర్వపు మార్తాండపురమే నేడు ఆచంటగా అలరారుచున్నది. దీనికి తార్కాణమే ఈ పురాణగాథ! పురం తారకాసుర సంహారనంతరం శివపార్వతులు కేళీ విలాసముగా విహరించు సమయమున ముని దంపతులు శివసాయిజ్యము కోరి కైలాసమేగగా పరోక్షముగా తిలకించుట గమనించి వారిని బాలబాలికలను చేసి, 'బ్రహ్మచర్యము ఆచరించిన కొద్ది కాలమునకు శివసాయిజ్యము పొందెదరు' అని శంకరుడు ఆ బాలలను ఆజ్ఞాపించెను. కానీ విధి వక్రీకరించి జన్మించిన శివుని యొక్క ఆజ్ఞ పాటించనందున శాపగ్రస్థులై భూలోకమున తిరువళ్లూరు గ్రామంలో బ్రాహ్మణుడు ఇంట పుష్పసుందరుడు - ఒడియనంబిగానూ, మార్తాండపురమున కళావంతుల ఇంట పుష్ప సుందరి - పరమనాచి గాను. శాప విమోచననంతరం ఒడియనంబి తీర్థయాత్రలు చేస్తూ మార్తాండపురం చేరెను.
ఒకనాటి దంపతులు రేయి మహాశివరాత్రి పర్వదినమున ఆ దంపతులు సుఖనిద్రకులోనై, పూజా కార్యక్రమాలకు సమయమతిక్రమించి నందున భక్తుడైన ఒడియనంబి, పరమనాచి యొక్క స్థానాగ్రభాగమున లింగాకృతి గా భావన చేసి పూజించి స్వామిని మెప్పించి, శంకరుని పరమపవిత్రురాలైన పరమనాచి (వేశ్య) స్థాపనకు. . ఆ స్వామి స్థానాగ్రభాగమున వెలిసిన కారణముగా మార్తాండపురము కాలక్రమేణా చంటీశ్వరునిగా పిలువబడుతూ విరాజిల్లుచున్నది. ఆ స్వామి వారికి లింగోద్బవ కాలమందు ఎవరిని దర్శించెదరో వారి మనోభీష్టాలు నెరవేరునని సర్వదా సకల సౌభాగ్యాలు చేకూరుస్తానని శ్రీ స్వామివారి పురాణ గాధలు చాటుచున్నవి.
శ్రీ రామేశ్వరస్వామి వారి ఆలయంలో గర్భాలయము నందు శ్రీ రామేశ్వర స్వామి పార్వతి దేవి అమ్మవారు మరియు ఆలయ ప్రాంగణంలో గల ఉపాయాలను దర్శించవచ్చు.
శ్రీ విఘ్నేశ్వర స్వామి
శ్రీ సప్త మాతృకలు
శ్రీ బ్రహ్మ దేవుడు
శ్రీ వీరభద్ర
శ్రీ విశ్వేశ్వర స్వామి
శ్రీ వాయుదేవుడు
శ్రీ కమఠేశ్వర స్వామి
శ్రీ లక్ష్మణేశ్వర స్వామి
శ్రీ కనకదుర్గ అమ్మవారు శ్రీ
ఆంజనేయస్వామి వారు
శ్రీ కేశవస్వామి వారు
శ్రీ చండీశ్వర స్వామి వారు
శ్రీ బృంగీశ్వర స్వామి
కుమారస్వామి
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శ్రీ
బాణాశుర
స్వామి
స్వామి
శ్రీరీటా దేవి
శ్రీ కాలభైరవుడు
శ్రీ పార్వతీ పరమేశ్వరులు
శ్రీ సరస్వతి దేవి
శ్రీ నవగ్రహ దేవతలు
శ్రీ సూర్యనారాయణస్వామి మరియు శ్రీ రామేశ్వరస్వామి వారి గర్భ లయం పై భాగమున శ్రీ చక్రసమేత చంద్రశేఖరస్వామి వారితో ఈ ఆలయము అత్యంత పవిత్రమైన క్షేత్రముగా అలరారుచున్నది. ఈ స్వామి వారి ఆలయ ప్రాంగణములో ఉపాలయమున శ్రీ సత్యనారాయణస్వామి వారికి భక్తులు విశేషముగా వ్రతములు జరుపుకుంటారు.