★శ్రీమావుళ్ళమ్మ అమ్మవారి చరిత్ర
భీమవరం ★
శ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు వెలసిన ప్రాంతం పై అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఈ ప్రాంత వాసులు విశ్వసించే చరిత్ర ఈ విధంగా ఉన్నది. శ్రీ మావుళ్ళమ్మ తల్లి క్రీస్తు సగం 1200 సంవత్సరంలో వెలసినట్లు చెబుతారు. ఈ అమ్మవారి గుడి విషయమై క్రీస్తుశకం 1880 సంవత్సరం నుండి మాత్రమే చరిత్ర లభ్య మవుతున్నది. భీమవరం పట్టణంలో ప్రస్తుతం ఉన్న మోటుపల్లి వారి వీధిలో అమ్మవారి గరగలు భద్రపరచుటకు నిర్మించిన భవన ప్రాంతంలో వేప చెట్టు, రావి చెట్టు కలిసి ఉన్నచోట కలిసి ఉన్నచోట శ్రీ మావుళ్ళమ్మ వెలిసారని తెలుస్తుంది. మామిడి చెట్లు ఎక్కువగా ఉన్నచోట వెలసిన తల్లి కనుక శుభప్రదమైన మామిడి పేరు మీదగా మామిళ్ళ అమ్మగా.... అనంతరం మావుళ్ళమ్మగా నామకరణం చెందిందని అభిప్రాయం. చిన్న చిన్న ఉల్లిపారంతా కలిసి అమ్మవారిని గ్రామదేవతగా కొలుచుటచే మావుళ్ళ అమ్మ మావుళ్ళమ్మగా నామాంతరం చెందారని మరికొందరి అభిప్రాయం.