మహాలక్ష్మి అష్టకమ్ - లక్ష్మి దేవికి అంకితం చేసిన స్తోత్రం. శ్రద్ధా, భక్తులతో ఈ మంత్రాని జపించడం వల్ల అధ్యాత్మిక ఆనందం లభిస్తుంది. అంతేకాకుండా వారి జీవితాన్ని విజయవంతం చేస్తుంది.
నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే
శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే ||
నమస్తే గరుడారూఢే డోలాసుర భయంకరి
సర్వపాపహరేదేవి మహాలక్ష్మి నమోస్తుతే ||
సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్ట భయంకరి
సర్వ దుఃఖహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే ||
సిద్ధిబుద్ధిప్రదేదేవి భుక్తిముక్తి ప్రదాయిని
మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మి నమోస్తుతే ||
ఆద్యన్తరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి
యోగజ్ఞే యోగసంభూతే మహాలక్ష్మి నమోస్తుతే ||
స్థూల సూక్ష్మే మహారౌద్రే మహాశక్తి మహాదరే
మహాపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే ||
పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి
పరమేశి జగన్మాతః మహాలక్ష్మి నమోస్తుతే ||
శ్వేతాంబరధరే దేవి నానాలంకార భూషితే
జగత్థ్సితే జగన్మాతః మహాలక్ష్మి నమోస్తుతే ||
మహాలక్ష్మ్యష్టకం స్తోత్రం యః పఠేద్భక్తిమాన్నరః
సర్వసిద్ధి మవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా ||
ఏకకాలే పఠేన్నిత్యం మహాపాపవినాశనం
ద్వికాలం యః పఠేన్నిత్యం ధనధాన్యసమన్వితః ||
త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రువినాశనం
మహాలక్ష్మీర్భవేన్నిత్యం ప్రసన్నా వరదా శుభా ||
ఇత్యందాకృత శ్రీ మహాలక్ష్మాష్టకస్తవం స్తోత్రం సంపూర్ణం.