Header Ads Widget

Ticker

శ్రీ భ్రమరాంబికాష్టకం

◀️ ▶️

శ్రీ భ్రమరాంబికాష్టకమ్


రవిసుధాకర వహ్నిలోచన రత్నకుండల భూషిణి

ప్రవిమలంబుగమమ్ము నేలిన భక్తజన చింతామణి

అవని జనులకు కొంగుబంగారైన దైవశిఖామణి

శివుని పట్టపురాణి, గుణమణి శ్రీగిరి భ్రమరాంబిక ౹౹


కలియుగంబున మానవులకును కల్పతరువై యుండవా

వెలయు శ్రీగిరిశిఖరమందున విభవమై విలసిల్లవా

ఆలసింపక భక్తవరులకు అష్టసంపద లీయవా

జిలుగు కుంకుమ కాంతి రేఖల శ్రీ గిరీ భ్రమరాంబికా ౹౹


అంగ వంగ కళింగ కాశ్మిరాంధ్ర దేశములందునన్

పొంగుచును వరహాల కొంకణ భూములయందునన్

రంగుగా కర్ణాట మగధ మరాట దేశములందునన్

శృంఖలా దేశముల వెలిసిన శ్రీగిరీ భ్రమరాంబికా ౹౹


అక్షయంబుగ కాశిలోపల అన్నపూర్ణ భావానివై

సాక్షిగణపతి కన్నతల్లివి సద్గుణావతి శాంభవీ

మోక్షమొసగెడు కనకదుర్గపు మూలకారణశక్తివీ

శిక్షజేతువు ఘోరభవముల శ్రీగిరీ భ్రమరాంబికా ౹౹


ఉగ్రలోచన వరవధూమణి యొప్పుగల్గిన భామినీ

విగ్రహంబుల కెల్ల ఘనమై వెలయు శోభన కారిణి

అగ్రపీఠమునందు వెలసిన ఆగమార్థ విచారిణీ 

శీఘ్రమే కని వరము లిత్తువు శ్రీగిరీ భ్రమరాంబికా ౹౹


నిగమగోచర నీలకుండలి నిర్మలాంగి నిరంజనీ

మిగులు చక్కని పుష్పకోమలి మిననేత్ర దయానిధీ

జగతిలోన ప్రసిద్ధికెక్కిన చంద్రముఖి సీమంతినీ

చిగురుటాకులవంటి పెదవుల శ్రీగిరీ భ్రమరాంబికా ౹౹


సోమశేఖర పల్లవాధరి సుందరీమణి ధీమణి

కోమలాంగి కృపాపయోనిధీ కుటిలకుంతల యోగినీ

నామనంబును బాయకుండుము నగకులేశుని నందినీ

సీమలోన ప్రసిద్ధికెక్కిన శ్రీగిరీ భ్రమరాంబికా ౹౹


భూతనాధుని వామభాగము పొందుగా చేకొంటివి

ఖ్యాతిగను శ్రీశైలమందు ప్రకాశముగ నెలకొంటివి

 పాతకంబులు బారద్రోలుచు భక్తులను చేకొంటివి

శ్వేతగిరిపైనుండి వెలసిన శ్రీగిరీ భ్రమరాంబికా ౹౹


తరుణి శ్రీగిరి మల్లికార్జున దైవరాయని భామినీ

కరుణతో  మమ్మేలు మెప్పుడు కల్పవృక్షము భంగిని

వరుసతో నీయష్టకంబును రాసి చదివిన వారికిన్

సిరుల నిచ్చెద వెల్లకాలము శ్రీగిరీ భ్రమరాంబికా ౹౹

ఫలం:- సర్వపీడా నివారణం, సర్వ శుభకరం.


ఇతర స్తోత్రములు

శ్రీ మహాలక్ష్మి అష్టకమ్

కనకధారా స్తోత్రమ్

ద్వాదశ జ్యోతిర్లింగా స్తోత్రమ్

నవరత్నామాలిక స్తోత్రం 

సరస్వతి స్తోత్రము

శ్రీ ఆంజనేయ దండకం

శ్రీ మహావిష్ణు అష్టభుజ పంచాయుధ స్తోత్రం

శ్రీ శివ పంచాక్షరీ స్తోత్రం

శ్రీరావణాకృత శివతాండవ స్తోత్రం

శ్రీ భ్రమరాంబికాష్టకం

శ్రీమహిషాసుర మర్దినీ స్తోత్రం

శివమానస పూజాస్తోత్రం