Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

govinda namalu by soujanyam



 ◀️ శ్రీ వెంకటేశ్వర గోవింద నామములు ▶️

 



  • శ్రీనివాస గోవిందా | శ్రీ వేంకటేశా గోవిందా
  • భక్తవత్సలా గోవిందా | భాగవత ప్రియ గోవిందా
  • నిత్య నిర్మలా గోవిందా | నీలమేఘశ్యామ గోవిందా
  • పురాణపురుషా గోవిందా | పుండరీకాక్షా గోవిందా
  • గోవిందా హరి గోవిందా | గోకుల నందన గోవిందా
  •  
  • నందనందనా గోవిందా | నవనీత చోర గోవిందా
  • పశుపాలక శ్రీ గోవిందా | పాపవిమోచన గోవిందా | 
  • దుష్టసంహార గోవిందా । దురితనివారణ గోవిందా |
  • శిష్టపరిపాలక గోవిందా | కష్టనివారక గోవిందా ।
  • గోవిందా హరి గోవిందా | గోకుల నందన గోవిందా
  •  
  • వజ్రమకుటధర గోవిందా | వరాహమూర్తి గోవిందా
  • గోపీజనలోల గోవిందా । గోవర్ధనోద్ధార గోవిందా
  • దశరథనందన గోవిందా | దశముఖ మర్దన గోవిందా
  • పక్షివాహన గోవిందా । పాండవప్రియ గోవిందా
  • గోవిందా హరి గోవిందా | గోకుల నందన గోవిందా

  • మత్స్యకూర్మా గోవిందా | మధుసూదనహరి గోవిందా
  • వరాహ నరసింహ గోవిందా | వామన భృగురామ గోవిందా
  • బలరామానుజ గోవిందా | బౌద్ధకల్కిధర గోవిందా
  • వేణుగాన ప్రియ గోవిందా | వేంకట రమణా గోవిందా
  • గోవిందా హరి గోవిందా | గోకుల నందన గోవిందా

  • సీతానాయక గోవిందా | శ్రితపరిపాలక గోవిందా
  • దరిద్ర్యజన పోషక గోవిందా | ధర్మసంస్థాపక గోవిందా
  • అనాధ రక్షక గోవిందా । అపద్బాంధవ గోవిందా
  • శరణాగతవత్సల గోవిందా | కరుణాసాగర గోవిందా
  • గోవిందా హరి గోవిందా | గోకుల నందన గోవిందా

  • కమలదళాక్ష గోవిందా | కామితఫలదా గోవిందా
  • పాపవినాశక గోవిందా I పాహిమురారే గోవిందా
  • శ్రీముద్రాంకిత గోవిందా | శ్రీవత్సాంకిత గోవిందా
  • ధరణీనాయక గోవిందా | దినకరతేజా గోవిందా
  • గోవిందా హరి గోవిందా | గోకుల నందన గోవిందా

  • పద్మావతీ ప్రియ గోవిందా | ప్రసన్న మూర్తి గోవిందా
  • అభయహస్త ప్రదర్శన గోవిందా | మర్త్యావతారా గోవిందా
  • శంఖచక్రధర గోవిందా ।శార్ఙ్గగదాధర గోవిందా
  • విరజాతీరస్థ గోవిందా । విరోధిమర్దన గోవిందా
  • గోవిందా హరి గోవిందా | గోకుల నందన గోవిందా

  • సాలగ్రామధర గోవిందా | సహస్రనామా గోవిందా
  • లక్ష్మీ వల్లభ గోవిందా | లక్ష్మణాగ్రజా గోవిందా
  • కస్తూరితిలకా గోవిందా | కాంచనాంబదరధర గోవిందా
  • గరుడవాహన గోవిందా | గజరాజరక్షక గోవిందా
  • గోవిందా హరి గోవిందా | గోకుల నందన గోవిందా

  • వానర సేవిత గోవిందా | వారధిబంధన గోవిందా
  • ఏడుకొండలవాడ గోవిందా | ఏకస్వరూపా గోవిందా
  • శ్రీరామకృష్ణా గోవిందా | రఘుకులనందన గోవిందా
  • ప్రత్యక్షదేవా గోవిందా | పరమ దయాకర గోవిందా
  • గోవిందా హరి గోవిందా | గోకుల నందన గోవిందా

  • వజ్రకవచధర గోవిందా | వైజయంతీ మాలధర గోవిందా
  • వడ్డికాసులవాడ గోవిందా | వసుదేవతనయా గోవిందా
  • బిల్వపత్రార్చిత గోవిందా | బిక్షుక సంస్తుత గోవిందా
  • స్త్రీపుంరూపా గోవిందా | శివకేశవమూర్తి గోవిందా
  • గోవిందా హరి గోవిందా | గోకుల నందన గోవిందా

  • బ్రహ్మాండరూపా గోవిందా । భక్తరక్షక గోవిందా
  • నిత్యకళ్యాణ గోవిందా । నీరజనాభ గోవిందా
  • హాథీరామ ప్రియ గోవిందా | హరిసర్వోత్తమ గోవిందా
  • జనార్దనమూర్తి గోవిందా | జగత్సాక్షిరూప గోవిందా
  • గోవిందా హరి గోవిందా | గోకుల నందన గోవిందా

  • అభిషేక ప్రియగోవిందా | అపన్నివారణ గోవిందా
  • రత్నకిరీటా గోవిందా । రామానుజనుత గోవిందా
  • స్వయం ప్రకాశ గోవిందా| ఆశ్రితపక్ష గోవిందా
  • నిత్య శుభప్రద గోవిందా । నిఖిల లోకేశా గోవిందా
  • గోవిందా హరి గోవిందా | గోకుల నందన గోవిందా

  • ఆనందరూపా గోవిందా ఆద్యంత రహితా గోవిందా
  • ఇహపరదాయక గోవిందా | ఇభరాజరక్షక గోవిందా
  • పరమదయాళో గోవిందా | పద్మనాభ హరి గోవిందా
  • తిరుమలవాస గోవిందా | తులసీ మాలధర గోవిందా
  • గోవిందా హరి గోవిందా | గోకుల నందన గోవిందా

  • శేషాద్రినిలయ గోవిందా | శేషశాయివి గోవిందా
  • శ్రీనివాసా గోవిందా | శ్రీ వేంకటేశా గోవిందా
  • గోవిందా హరి గోవిందా | గోకుల నందన గోవిందా

  • నీ పాదకమల సేవయు
  • నీపాదార్చకులతోడి నెయ్యము
  • నితాంతపార భూతదయమును
  • తాపసమందార నాకు దయసేయగదే
  •  
  •   ఈ పోస్టు నచ్చినట్టయితే కామెంటు వ్రాయవలసినదిగా ప్రార్థన!
  •  
  •  
  • మరిన్ని స్తోత్రముల కొరకు ఇక్కడ చదవండి!

    👉 శ్రీ మహాలక్ష్మి అష్టకమ్

    👉 కనకధారా స్తోత్రమ్

    👉 ద్వాదశ జ్యోతిర్లింగా స్తోత్రమ్

    👉 నవరత్నామాలిక స్తోత్రం 

    👉 సరస్వతి స్తోత్రము

    👉 శ్రీ ఆంజనేయ దండకం

    👉 సంకటనాశన గణేశ స్తోత్రమ్

    👉 శ్రీ మహావిష్ణు అష్టభుజ పంచాయుధ స్తోత్రం

    👉 శ్రీ శివ పంచాక్షరీ స్తోత్రం

    👉 శ్రీరావణాకృత శివతాండవ స్తోత్రం

    👉 శ్రీ భ్రమరాంబికాష్టకం

    👉 శ్రీమహిషాసుర మర్దినీ స్తోత్రం

    👉 శివమానస పూజాస్తోత్రం

    👉 దేవి స్తుతి మంత్ర

     
  •  

    ఈ కిందవి చదవండి👇👇

    కార్తీక పౌర్ణమిని త్రిపుర పౌర్ణమి అని ఎందుకు పిలుస్తారు?

    మావుళ్ళమ్మ అమ్మవారు ఆలయ చరిత్ర, భీమవరం

    బ్రహ్మపుత్రానది స్టోరీ

    హనుమాన్ పుట్టిన ప్రదేశం గురించి నిర్వహించిన సభ

    హనుమాన్ చాలీసా అనుగ్రహ ఫలం:-

    కొత్తగా దొరికిన విష్ణుమూర్తి విగ్రహం

     

  •  
  •